Maharashtra doctor: ఎస్సై వేధింపులు.. అరచేతిలో సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య!
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:51 PM
తన చావుకు పోలీస్ అధికారి, ఎస్సై గోపాల్ బద్నే కారణమంటూ మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ లో ఒక హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: పోలీస్ అధికారి వేధింపులు తట్టుకోలేక మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలో జరిగింది. తన చావుకు పోలీస్ అధికారి, ఎస్సై గోపాల్ బద్నే కారణమంటూ మహిళా డాక్టర్ తన చేతిపై సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. మహారాష్ట్ర సతారా జిల్లా ఫల్టాన్‌లోని ఓ హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని రాసుకొచ్చింది . గత నాలుగు నెలల్లో ఐదు సార్లు తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. తనపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి స్థానిక డీఎస్పీకి సదరు మహిళా డాక్టర్ గతంలోనే లేఖ రాసింది.
ఈ ఘటనపై పోలీస్ అధికారి ఎస్సై గోపాల్ బద్నేతో పాటు మరో అధికారి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటు ఎస్సైపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు విధించింది. పోలీస్ అధికారే ఇలాంటి ఘటనలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇవి కూడా చదవండి:
Ashok: ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్.. ఢిల్లీలోని ఇటలీ టెంపుల్ చుట్టూ..
Minor girl: 3 ఏళ్ల చిన్నారికి చిప్స్ ఆశ చూపించి....ఆపై