Minor girl: 3 ఏళ్ల చిన్నారికి చిప్స్ ఆశ చూపించి....ఆపై
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:59 PM
చిన్నారికి చిప్స్ ఆశ చూపించి ఒక యువకుడు రేప్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
జైపూర్, అక్టోబర్ 24: చిన్నారికి చిప్స్ ఆశ చూపించి ఒక యువకుడు రేప్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారికి యువకుడు చిప్స్ ఆశ చూపించాడు. అలా అతడి వెంట వెళ్లిన చిన్నారిని పోలంలోకి తీసుకు వెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గాయాలు పాలైన ఆ చిన్నారిని ఇంటి వద్ద వదిలి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక బిగ్గరగా ఏడుస్తుండడంతో గ్రామస్తుల సహాయంలో స్థానిక ఆసుపత్రికి ఆమె తల్లిదండ్రులు తరలించారు. అయితే చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మెరుగైన వైద్య చికిత్స కోసం జోధ్‌పూర్ తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో చిన్నారిని జోధ్‌పూర్ తరలించారు. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాలీ జిల్లాలో నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు భరత్‌పూర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పాలీ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి అతడిని విచారిస్తున్నారు. ఈ విచారణలో అతడు పలు కీలక విషయాలు వెల్లడించాడు. ఈ దారుణానికి పాల్పడే ముందు 15 అశ్లీల చిత్రాలకు సంబంధించిన వీడియోలు వీక్షించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
ఇంకోవైపు రాష్ట్రంలో అత్యాచార ఘటనలు భారీగా పెరగడంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ముఖ్యంగా మహిళలపై దాడులు బాగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా దళితులు, తెగల మహిళలపై ఈ దాడులు కొనసాగుతోన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సు దగ్ధం.. వి కావేరి ట్రావెల్స్ సంచలన నిర్ణయం
పసిడి ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్..
For More National News And Telugu News