Home » Crime News
ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకూ ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దు అన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండీషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందిన మహ్మద్ అహ్మద్(26) తండ్రి మహ్మద్ మియా రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ అహ్మద్ రాజేంద్రనగర్ సర్కిల్ భవానీ కాలనీలోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో రెండు నెలలుగా అద్దెకుంటున్నాడు.
అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్‌స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది.
మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.
హైదరాబాద్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరాన్ని సూరి గ్యాంగ్ అడ్డాగా మార్చుకున్నట్లు తెలిపారు.
ఓ మహిళ అనూహ్యంగా మరణించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. అమీన్ పూర్ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్ లో మనీషా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా..