Share News

Hyderabad: అయ్యో రుతిక.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 15 , 2026 | 07:53 AM

పండగపూట ఓ ఇంంట్లో విషాదం నెలకొంది. ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని మచ్చబొల్లారం, గోపాల్‌నగర్‌ ద్వారకనగర్‌ కాలనీకి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అయ్యో రుతిక.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..

- పండగ పూట విషాదం

- యువతి ఆత్మహత్య

- చదువుకో .. అతిగా మొబైల్‌ వాడొద్దని తల్లి మందలింపు

హైదరాబాద్: పండగ వేళా ఆ ఇంట్లో విషాదం అలుముకొంది. చదువుకో.. అతిగా మొబైల్‌(Mobile) వాడొద్దని కూతురును తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం, గోపాల్‌నగర్‌ ద్వారకనగర్‌ కాలనీకి చెందిన అర్చన, నాగార్జున భార్యాభర్తలు. వీరికి రుతిక(19) అనే కూతురు ఉంది. అల్వాల్‌ లయోలా కాలేజీ(Alwal Loyola College)లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.


city3.2.jpg

చదువును నిర్లక్ష్యం చేయడం, తరుచుగా ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్‌ చేయడంతో కూతుర్ని తల్లి మందలించేది. బుధవారం కూడా మందలించడంతో మనస్థాపానికి గురైన రుతిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 07:53 AM