Home » Crime News
కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌లో కలకలం రేగింది. గైనకాలజీ విభాగం వాష్‌రూమ్‌లో 30 ఏళ్ల నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వాష్‌రూమ్ తలుపులు బద్దలుగొట్టి ఆమె మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసుకున్నారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు.
బోనాల పర్వదినం వేళ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు.
మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై కారు, లారీని ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పని ప్రదేశంలో వేధింపుల కారణంగా ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు తనను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది.
2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.
రూ.44 లక్షల కోసం కట్టుకున్న భార్యను నలుగురు స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించాడు. పోలీసులు మొదట నిజమని భావించినప్పటికీ చివరికి గుట్టు రట్దైంది.
వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగించాడు.
నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు, ఇంటర్ విద్యార్థినిని రెండు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
విడాకుల కేసు విచారణలో ఉండగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన కుమార్తె, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేధింపులు, పరువునష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని ఓ వృద్ధుడు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.