బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు..
ABN , Publish Date - May 15 , 2026 | 06:27 PM
బండి భగీరథ్ పోక్సో కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లోని కొన్ని ఛానళ్లు బాధిత కుటుంబం వివరాలు బహిర్గతమయ్యేలా ఫోటోలు, వీడియోలు ప్రసారం చేశాయి. ఇవి వైరల్‌గా మారడంతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక, ఆమె కుటుంబ వివరాలు బయటపెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్లను గుర్తించి సంబంధిత యూఆర్ఎల్‌లను ఉన్నతాధికారులకు పంపించారు. ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు. బాధితురాలి గోప్యతకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
జవహర్‌నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసు.. ప్రధాన నిందితుల అరెస్ట్
కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్.. అసలు విషయమిదే..