మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో విచారణ వేగవంతం..
ABN , Publish Date - May 09 , 2026 | 11:14 AM
మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనూజను హత్య చేసి పారిపోయిన పని మనిషి కల్పన అండ్ గ్యాంగ్ కోసం 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
హైదరాబాద్: విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున నేపాలీ గ్యాంగ్ ఆమెను హత్య చేసి బంగారం, నగదుతో ఉడాయించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. తనూజను హత్య చేసి పారిపోయిన పని మనిషి కల్పన అండ్ గ్యాంగ్ కోసం 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఇప్పటికే నేపాల్‌తో పాటు ముంబై, లక్నో, ఢిల్లీకి పోలీసు బృందాలు చేరుకున్నాయి. పని మనిషి కల్పన చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో లక్నోలో కల్పన పని చేసిన ఇంటికి వెళ్లి ఆమె గురించి యజమానులను ప్రశ్నించారు. అయితే, తమ ఇంట్లోనూ భారీగా బంగారం, వెండి, నగదు మాయమైనట్లు పోలీసులకు వారు తెలిపారు. కల్పనతో ఉన్న ఇద్దరు యువకుల గురించీ కూపీ లాగుతున్నారు. హత్య అనంతరం ముగ్గురు నిందితులు నాంపల్లిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మాజీ ఐపీఎస్ ఇల్లు, నాంపల్లి రైల్వేస్టేషన్ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇవాళ (శనివారం) జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తనూజ అంత్యక్రియలు జరగనున్నాయి. మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య మృతదేహానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కూల్ కూల్‌గా.. ఏసీ కన్నా కూలర్ బెటర్
భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్