Share News

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ABN , Publish Date - May 14 , 2026 | 07:40 PM

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటనలో సుమారు 350 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేశారు కస్టమ్స్ అధికారులు. ఈ ఘటనలో ఓ వ్యక్తి వద్ద నుంచి 233.5 గ్రాములు, మరో వ్యక్తి నుంచి 117 గ్రాముల చొప్పున మొత్తం సుమారు 350 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.


కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 13న జెడ్డా(సౌదీ అరేబియా), దోహా(ఖతార్) ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ పురుషుల నుంచి ఈ బంగారం లభ్యమైంది. వారిరువురూ సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం SV-756, ఇండిగో 6E-1308 విమానాల్లో వేర్వేరుగా వచ్చారు. వారి కదలికలపై అధికారులకు అనుమానం రావడంతో వెంటనే తనిఖీ చేశారు. వారు ఉపయోగించే వాటర్ బాటిళ్ల అడుగు భాగంలో బంగారాన్ని ఉంచి రహస్య అరలతో మార్పులు చేసినట్టు గుర్తించారు. అనుమానం రాకుండా ఉండేందుకు దానిపై వెండి రంగు పూతపూసిన రౌండ్ షేప్‌లో ఉన్న బంగారం ముక్కలను కింద అమర్చారు. దీనివల్ల సాధారణ తనిఖీల సమయంలో వీటిని గుర్తించడం అత్యంత కష్టంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.


ఇవీ చదవండి:

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం

మూడో దశ 'సర్' అమలుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో..

Updated Date - May 14 , 2026 | 07:47 PM