భార్యతో గొడవ.. నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య..
ABN , Publish Date - May 14 , 2026 | 09:39 PM
లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కామారెడ్డి: లింగంపేట మండలం మోతె గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నాటు తుపాకీతో కాల్చుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోతె గ్రామానికి చెందిన ఇంద్రజిత్ సింగ్‌కి ఓ మహిళతో కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వారి కాపురంలో వివాదాలు మెుదలయ్యాయి. దీంతో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు.
ఈరోజు (గురువారం) కూడా వారి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. అయితే, ఈసారి వివాదం మాటలతో ముగిసిపోలేదు. తరచూ గొడవలతో విసిగిపోయిన ఇంద్రజిత్ సింగ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన వద్ద ఉన్న నాటు తుపాకీ తీసుకుని భార్య ముందే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు .. 2026-27 నుంచి కొత్త విధానం అమలు