Share News

తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి

ABN , Publish Date - May 09 , 2026 | 08:55 AM

సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతిచెందాడు.

తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి
Sangareddy Lift Accident

సంగారెడ్డి: ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతిచెందాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేంకటేశ్వర్లు.. రామచంద్రారెడ్డి నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. అయితే, ఆడుకునేందుకు వెళ్లిన వేంకటేశ్వర్లు కుమారుడు గిరిధర్ లిఫ్ట్ ఎక్కాడు. ప్రమాదవశాత్తూ అందులో ఇరుక్కుపోయాడు.


లిఫ్ట్ నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తమయ్యారు. వెంటనే లిఫ్ట్ వద్దకు పరుగులు తీశారు. అతి కష్టంపై చిన్నారిని బయటకు తీశారు. బాలుడు స్పృహలో లేకపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గిరిధర్ మృతిచెందినట్టు వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతమైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‏లో..పెరిగిన చిక్కుడుకాయ.. తగ్గిన వంకాయ

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్

Updated Date - May 09 , 2026 | 10:17 AM