హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - May 09 , 2026 | 07:27 AM
టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నామని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నామని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. 11కేవీ హౌసింగ్‌బోర్డ్డు కాలనీ, శంకర్‌నగర్, మిల్క్‌బూత్ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, అక్బర్‌బాగ్ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో ఉదయం 11నుంచి 11.30గంటల వరకు, ఆర్టీఏ ఆఫీస్, వాహేద్‌నగర్, వెంటాద్రినగర్ ఫీడర్ల పరిధిలోని పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. రిసాల, సీఐటీ యూ ఆఫీస్‌లేన్ ప్రాంతాల్లో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1, సీఈకాలనీ, సాయి బాబా టెంపుల్‌రోడ్, నారాయణగూడ, చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News