Share News

భారత వ్యవహారాల్లో ట్రంప్‌ జోక్యం తగదు

ABN , Publish Date - May 09 , 2026 | 06:48 AM

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రధాని మోదీకి అభినందనలు...

భారత వ్యవహారాల్లో ట్రంప్‌ జోక్యం తగదు

  • అమెరికా అధ్యక్షుడికి ఎంపీ సంజయ్‌ రౌత్‌ లేఖ

న్యూఢిల్లీ, మే 8: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రధాని మోదీకి అభినందనలు తెలపడాన్ని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో ఆయన నేరుగా ట్రంప్‌కే ఒక లేఖ రాశారు. భారత అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల అభినందనలు అపరిపక్వమైనవి అని పేర్కొన్నారు. బెంగాల్‌ ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాత వైఖరి లోపించిందని, ఎన్నికల సంఘం పనితీరు బీజేపీకి అనుకూలంగా ఉందన్న ఆరోపణలు ఉన్నాయని ఆయన తన లేఖలో నొక్కి చెప్పారు. కాగా, సంజయ్‌ రౌత్‌ లేఖపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రౌత్‌ను ‘భారత రాజకీయాల్లో జోకర్‌’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 06:48 AM