Share News

ఏపీకి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు!

ABN , Publish Date - May 09 , 2026 | 06:49 AM

రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విలీనంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏపీ నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించగా..

ఏపీకి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు!

  • అక్కడి ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనమయ్యాక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న సంఘాల నేతలు

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) విలీనంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏపీ నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించగా.. తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ, ఆ తర్వాత ఎదురైన పరిస్థితులపై వారు అధ్యయనం చేస్తున్నారు. అక్కడి అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, క్షేత్రస్థాయిలో ఇతర సిబ్బందితో నేరుగా మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. తమ అధ్యయనానికి సంబంధించి కీలక అంశాలపై ఇక్కడ అనుసరించాల్సిన విధానాలపై యాజమాన్యం, ప్రభుత్వానికి కార్మిక సంఘాల నాయకులు నివేదిక అందించనున్నారు. అధ్యయన పర్యటనలో భాగంగా వేతన సవరణ, వైద్య వసతి, పెన్షన్‌, పరిపాలన, ఆర్థికపరమైన అంశాలు, పీఎఫ్‌, తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - May 09 , 2026 | 06:50 AM