రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో
ABN , Publish Date - May 09 , 2026 | 06:46 AM
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ఉత్తరకొరియా సైనికుల్లో 2,300 మంది చనిపోయారని బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది...
2,300 మంది నార్త్ కొరియా సైనికుల మృతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ఉత్తరకొరియా సైనికుల్లో 2,300 మంది చనిపోయారని బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. ఉపగ్రహ చిత్రాలు, నార్త్ కొరియా రాజధాని ప్యాంగాంగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన స్మారకాల చిత్రాలను విశ్లేషించి బీబీసీ ఈ విషయాన్ని తెలిపింది. ఉత్తర కొరియా కనీసం 11వేల మంది సైనికులను రష్యాకు పంపించిందని దక్షిణ కొరియా గతంలోనే అంచనా వేసింది. 2024 ఆగస్టులో ఉక్రెయిన్‌లోని కుర్క్స్ ప్రాంతంలో రష్యా తరఫున నార్త్ కొరియా సైనికులు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో చనిపోయిన సైనికులకు గుర్తుగా ప్యాంగాంగ్‌లో మ్యూజియాన్ని నిర్మించాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ 2025లోనే అధికారులను ఆదేశించారు. ఆ మ్యూజియం నిర్మాణం, స్మారక చిహ్నాలపై ఏర్పాటు చేసిన ఫొటోలను విశ్లేషించి బీబీసీ సంస్థ సైనికుల మరణాలను అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం