Share News

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి

ABN , Publish Date - May 15 , 2026 | 03:15 PM

పెళ్లైన ఐదు నెలలకే 33 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

పెళ్లైన 5 నెలలకే నవ వధువు అనుమానాస్పద మృతి
Uttar Pradesh news

ఉత్తరప్రదేశ్, మే15: పెళ్లైన ఐదు నెలలకే 33 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్రాంతానికి చెందిన ట్విషా శర్మ అనే మహిళ భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తమ బిడ్డది ఆత్మహత్య కాదని.. అత్తింటి వారి వేధింపుల కారణంగా జరిగిన హత్యని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ట్విషా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..


ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ, భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో ట్విషా శ్వాస తీసుకోవడం లేదనే సమాచారం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంటనే వారు ట్విషా ఇంటికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రి 10 నిమిషాల దూరంలోనే ఉన్నప్పటికీ, అక్కడికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


అంతేకాక సంఘటన జరిగిన రోజు రాత్రి 10:05 గంటలకు ట్విషా తమకు ఫోన్ చేసిందని మృతురాలి తల్లి తెలిపింది. అత్తగారి ఇంట్లో తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ట్విషా చెప్పిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ట్విషా శర్మను ఆమె భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేగాకుండా ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో బలవంతంగా అబార్షన్ చేయించారని మృతులి తంట్రి తీవ్రమైన ఆరోపణలు చేశాడు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న భోపాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్విషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు చేసిన తీవ్రమైన ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు, భర్త, అత్తమామలను వివారించనున్నట్లు సమాచారం. గృహ హింస, కట్నం వేధింపుల కారణంగా మరో యువతి బలికావడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

నీట్ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated Date - May 15 , 2026 | 03:15 PM