వన్డే కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రకటన
ABN , Publish Date - May 15 , 2026 | 02:28 PM
ఐపీఎల్‌లో తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టిన జస్ప్రీత్ బుమ్రా.. ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. వన్డే కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అధిక స్కోర్లు నమోదై.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై దెబ్బకు పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాడు. తన సారథ్యంలో తొలి విజయం నమోదు చేయడం సంతోషంగా ఉందని బుమ్రా తెలిపాడు. ఈ క్రమంలోనే వన్డే కెప్టెన్సీపై బుమ్రా(Jasprit Bumrah) ఓ సంచలన ప్రకటన చేశాడు. తన కెరీర్‌లో వన్డే కెప్టెన్సీ మాత్రమే చేయాల్సి ఉందని, అయితే, అది మాత్రం జరిగేలా అనిపించడం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. ''పంజాబ్‌పై విజయంతో ఐపీఎల్‌లో నా కెప్టెన్సీ మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ అద్భుతంగా ఆడాయి. మా జట్టు మిడిల్‌లో కాస్త వెనకబడినట్లు అనిపించినా.. చివరికి విజయం సాధించింది. ప్రస్తుతం డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. గతంతో పోలిస్తే ఇప్పుడు పిచ్ చాలా పొడిగా ఉంది. లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేస్తేనే ఫలితం అనుకూలంగా వస్తుంది. మా వ్యూహం కూడా అదే. తక్కువ పేస్‌తో బౌలింగ్ చేయాలని అనుకున్నాం. అలాగే చేసి సక్సెస్ అయ్యాం' అని తెలిపాడు.
'ఈ విజయంలో క్రెడిట్ తిలక్, శార్దూల్‌కే దక్కుతుంది. రికెల్టన్, జాక్స్ ఆటను తక్కువ చేయడం లేదు. చిన్న కంట్రిబ్యూషన్ అయినా టీ20ల్లో చాలా ప్రభావం చూపిస్తుంది. ప్రతిఒక్కరూ తమ వంతుగా కృషి చేసి జట్టును గెలిపించారు. ఐపీఎల్‌లో తొలిసారి సారథ్యం చేశాను. ఇంతకుముందు టెస్టులకు సారథ్యం వహించాను. అంతర్జాతీయ టీ20ల్లోనూ కెప్టెన్‌గా చేశాను. ఇక మిగిలింది వన్డేలు మాత్రమే. ఇప్పటి వరకు వన్డేల్లో అలాంటి ఛాన్స్ రాలేదు. అది జరిగేలా అనిపించడం లేదు’ అని బుమ్రా సరదాగా వ్యాఖ్యానించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు..