ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు..
ABN , Publish Date - May 15 , 2026 | 12:55 PM
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నడిపించాడు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు ఓ అరుదైన రికార్డును సృష్టించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(33 బంతుల్లో 75 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నడిపించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఓ రికార్డులో తొలి జట్టుగా ముంబై నిలిచింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు. గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌కు సూర్యకుమార్ కూడా అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను బుమ్రాకు అప్పగించారు. తద్వారా ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు ఇండియన్ కెప్టెన్ల సారథ్యంలో ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
ఇప్పటివరకు ఒకే సీజన్‌లో ఏ జట్టుకు కూడా ముగ్గురు భారత ఆటగాళ్లు కెప్టెన్లగా వ్యవహరించలేదు. ఓవరాల్‌గా ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన ఐదో జట్టుగా ముంబై నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో తమ తొలి మ్యాచ్ గెలిచిన ముంబై కెప్టెన్లుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా జస్ప్రీత బుమ్రా చేరాడు. అతడు కెప్టెన్‌గా వ్యవహరించిన గురువారం నాటి మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది.
ఒకే సీజన్‌లో ముగ్గురు కెప్టెన్ల నాయకత్వంలో ఆడిన జట్లు
ముంబై ఇండియన్స్ - 2008 (హర్భజన్, పొలాక్, టెండూల్కర్)
పుణే వారియర్స్ - 2013 (మాథ్యూస్, రాస్ టేలర్, ఫించ్)
ఎస్‌ఆర్‌హెచ్ - 2021 (డేవిడ్ వార్నర్, విలియమ్సన్, మనీశ్ పాండే)
పంజాబ్ కింగ్స్ - 2024 (శిఖర్, సామ్ కరన్, జితేశ్)
ముంబై ఇండియన్స్- 2026 (హార్దిక్, సూర్య, బుమ్రా)
ఈ వార్తలు కూడా చదవండి
తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!