Share News

గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - May 15 , 2026 | 12:40 PM

హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
Hyderabad News

హైదరాబాద్, మే 15: మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) చదువుతున్న జనార్దన్.. తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా. విషయం తెలిసిన వెంటనే జనార్దన్ తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే గదిలో రక్తపు మరకలు ఉండటంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు వాదిస్తున్నారు.


ఇదే విషయంపై పోలీసులకు జనార్దన్ పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. గదిలో రక్తం ఉండటంపై అనుమానాలు ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జనార్దన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం సాయంతో మియాపూర్ పోలీసులు.. మృతుడి గదిలోని ఆధారాలను సేకరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2026 | 12:58 PM