ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 15 , 2026 | 10:55 AM
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
చిత్తూరు, మే 15: జిల్లాలోని పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలుకోల్పోయారు. ఆగి ఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణకు చెందిన వారుగా సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
శ్రీభగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న మంత్రి లోకేశ్
నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజలతో శంకుస్థాపనలు
Read Latest AP News And Telugu News