నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - May 15 , 2026 | 12:15 PM
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్‌పై వచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానీకానికి తన సంకేతాన్ని అందించారు.
కృష్ణా జిల్లా, మే 15: ప్రజలందరూ ‘నా దేశం - నా బాధ్యత’ అనే నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి సైకిల్‌పై వచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానీకానికి తన సంకేతాన్ని అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యుద్ధం నేపథ్యంలో దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న దృష్ట్యా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధాని పిలుపును అందరూ గౌరవించాలన్నారు. దానిలో భాగంగానే ఇంధనంతో పాటు వంటనూనె, గ్యాస్ తదితర ఖర్చులన్నింటినీ పరిమితం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకొని ఖర్చును ఆదా చేస్తున్నట్టు తెలిపారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రజాదర్బార్‌కు సైకిల్‌పై హాజరైనట్లు మంత్రి తెలిపారు. దేశం కోసం పొదుపును అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి ఒక సోలార్ కనెక్షన్ ఏర్పాటుకు ప్రజలంతా ముందుకు రావాలని మంత్రి కొల్లురవీంద్ర పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో రూ.17 కోట్ల అభివృద్ధి పనులకు ప్రజలతో శంకుస్థాపనలు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
Read Latest AP News And Telugu News