Share News

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ABN , Publish Date - May 15 , 2026 | 07:27 AM

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌‌పై రూ.3కు పైగా పెంచాయి. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel price hike india

న్యూఢిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌‌పై రూ.3కు పైగా పెంచాయి. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. దాంతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వీటి ధరలు మారాయి. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ఆయిలు కంపెనీలు నిర్ణయించాయి.


2024, మార్చి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వీటి ధరలను లీటర్‌కు రూ.2 మేర ఆయిల్ కంపెనీలు తగ్గించిన విషయం విదితమే. మరో వైపు నయారా, షెల్ వంటి ప్రైవేట్ రిఫైనరీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే.


  • ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14పై పెంచాయి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచాయి.

  • (పెంచిన ధరలతో..)

  • ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77, డీజిల్ ధర రూ. 90.67 గా ఉంది.

  • కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.74, డీజిల్ రూ.95.13గా ఉంది.

  • ముంబయిలో పెట్రోల్ లీటర్ ధర రూ.106.68, డీజిల్ రూ.93.14 గా ఉంది.

  • చెన్నైలో పెట్రోల్ లీటర్ ధర రూ.103.67, డీజిల్ ధర రూ.95.25గా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉన్నత విద్యారంగం బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి లోకేశ్

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

For More National News And Telugu News

Updated Date - May 15 , 2026 | 08:07 AM