ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
ABN , Publish Date - May 15 , 2026 | 05:45 AM
‘ఒక్క సెంటు భూమిని అన్యాయంగా ఆక్రమించినట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకొంటా’ అని జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
అది ఆక్రమిత స్థలం కాదు: రవీంద్రనాథ్ రెడ్డి
కడప ఎర్రముక్కపల్లె, మే 14(ఆంధ్రజ్యోతి): ‘ఒక్క సెంటు భూమిని అన్యాయంగా ఆక్రమించినట్లు నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకొంటా’ అని జగన్ మేనమామ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ‘ఆరోపణలు చేసిన స్థలం ఆక్రమించినది కాదు. నలుగురం కలసి కొనుగోలు చేసిన ఒరిజినల్ పట్టా భూమి. తప్పుడు ఆరోపణలు చేస్తే సివిల్, క్రిమినల్ కేసులు వేస్తా’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.