Home » Cricket
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పిచ్ వివాదంపై స్పందించాడు. ఇలాంటి పిచ్‌లను కోరడం మానుకోవాలని సూచించాడు.
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తాడని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌పై ఇంత చర్చ అవసరం లేదని.. అనుకున్నట్లే పిచ్ ఉందని వెల్లడించాడు. నలుగురు స్నిన్నర్లతో ఆడించడం తప్పేమీ కాదని తెలిపాడు.
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఓటమిని చవిచూసింది. ఆ టోర్నీ ఆసాంతం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచిన భారత్.. ఫైనల్లో బలమైన ఆసీస్‌ను ఎదుర్కోలేకపోయింది. ఫలితం.. కంగూరులకే ప్రపంచ కప్ దక్కింది.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ బెంగాల్‌కు చెందిన ఓ స్పిన్నర్‌ను రంగంలోకి దింపింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడం అతడి ప్రత్యేకత. ప్రొటీస్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ స్పిన్నర్‌తో నెట్స్‌లో బౌలింగ్ వేపిస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.
సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. దేశవాళీల్లో ఆడకపోతే ఇలాంటి పిచ్‌లపై ఆడలేరని విమర్శలు గుప్పించాడు.
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో ఉన్న 18 మ్యాచుల్లో టీమిండియా ఎనిమిది టెస్ట్‌లు ఆడేసింది. వీటిలో నాలుగు గెలిచి, మూడు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరి టీమిండియా ఫైనల్ చేరాలంటే ఇంకా ఎన్ని గెలవాలంటే..
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై వస్తున్న విమర్శలపై పిచ్ క్యురేటర్ సుజన్ ముఖర్జీ స్పందించారు. భారత శిబిరం చెప్పినట్లుగానే పిచ్ తయారు చేశానని చెప్పాడు. టెస్టు మ్యాచ్‌లకు పిచ్ ఎలా సిద్ధం చేయాలో తనకు తెలుసని వెల్లడించాడు.