Home » Cricket
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్‌ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ స్టార్క్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి ఓ అరుదైన క్లబ్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
టీమిండియాలో మూడో స్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు. మూడో స్థానంపై ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ తనను ట్రోల్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా వెల్లడించారు. మళ్లీ తానే క్షమాపణలు చెప్పాడని తెలిపాడు.
నవంబర్ 26న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో జార్ఖండ్ జట్టుకు టీమిండియా స్టార్ హిట్టర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ మినీ వేలాన్ని ఆపేసి.. ఏడాది పాటు ట్రేడ్ విండో తెరిచే ఉంచాలని సూచించాడు. రెండు నెలలు మాత్రమే ఉన్న ఈ టోర్నీని ఆరు నెలలకు పొడగించాలని తెలిపాడు.
టీమిండియా మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. గత కొంత కాలంగా ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్న స్మృతి.. తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.
అబుదాబి టీ10 లీగ్‌లో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ బౌలర్ దహానీకి భజ్జీ షేక్‌హ్యాండ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై స్పందించాడు. కోచ్‌గా ప్లేయర్లకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీరేనని గంభీర్‌కు సూచించాడు.
బంగ్లాదేశ్ తరఫున వంద టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వందో టెస్టులో సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.