ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానం అభిషేక్ శర్మదే
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:18 PM
పొట్టి ప్రపంచ కప్ 2026 ముంగిట ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను వెల్లడించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026 ముంగిట ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను వెల్లడించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విఫలమై పాయింట్లు కోల్పోయినప్పటికీ.. 917 పాయింట్లతో అగ్రస్థానం అభిషేక్ శర్మ(Abhishek Sharma)కే దక్కింది.
ఈ జాబితా(ICC T20 Rankings)లో అభిషేక్ శర్మ తర్వాత 834 పాయింట్లతో ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో జోస్ బట్లర్ 769 పాయింట్లతో ఉన్నాడు. కాగా టీమిండియా ప్లేయర్లు తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకోవడం విశేషం. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌కు దూరమైన తిలక్ వర్మ.. తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి పడిపోయాడు. గత నెలలో సర్జరీ కారణంగా జట్టుకు దూరమైన తిలక్ వర్మ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అమెరికాతో భారత్ ‘ఏ’ జట్టు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న అనంతరం ప్రధాన జట్టుతో చేరనున్నాడు. సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చిన భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యాడు. సూర్య ఆరో స్థానానికి ఎగబాకి 728 రేటింగ్ పాయింట్లు సాధించాడు.
ఇషాన్ కిషన్ విధ్వంసం
టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుపు వేగంగా దూసుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో సెంచరీ సాధించిన ఇషాన్.. ఏకంగా 32 స్థానాలు ఎగబాకి 32వ ప్లేస్‌కి చేరుకున్నాడు. ప్రపంచ కప్ గ్రూప్ దశలో భారత తుది జట్టులో చోటు దక్కితే వచ్చే రెండు వారాల్లోనే ఇషాన్ టాప్ 10లోకి చేరే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ