భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:21 PM
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించడంతో దానికి మద్దతుగా పాక్.. భారత్‌తో మ్యాచ్‌లను ఆడబోమని తెలిపింది. ఐసీసీ హెచ్చరించినా తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘నూటికి నూరు శాతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. మరో నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారికొస్తుంది. భారత్, పాక్ పోరును చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. పాకిస్థాన్ భారీ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. బ్రాడ్‌కాస్టర్లు పెద్ద మొత్తాల్లో నష్టపోతారు. మిగతా బోర్డులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఐసీసీ మీటింగ్‌లో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. పీఎస్‌ఎల్ కోసం వదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు రావు. భారత్-పాకిస్థాన్ ఇప్పటికే తటస్థ వేదికల్లో పోటీ పడుతున్నాయి. దీంతో ఇక్కడ వేదిక అనేది సమస్యే కాదు. కాబట్టి ఓ ప్రత్యర్థితో నేను ఆడను అనడం ఆమోదయోగ్యం కాదు. పాకిస్థాన్‌కు పాకిస్థానే ఓ పెద్ద శత్రువు. దీనంతటికీ వారి మైండ్‌సెట్ కారణం’ అని అశ్విన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ