టీ20 డబ్ల్యూసీ-2026: భారీ స్కోర్ చేసిన భారత్..
ABN , Publish Date - Feb 04 , 2026 | 09:43 PM
టీ20 ప్రపంచ కప్-2026 కోసం ఇవాళ(బుధవారం) నవీ ముంబై వేదికగా వార్మప్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్.. 240 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup-2026) కోసం ఇవాళ(బుధవారం) నవీ ముంబై వేదికగా వార్మప్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన భారత్ 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ (53 రిటైర్డ్ హర్ట్), వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ (45) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (30), అభిషేక్ శర్మ (24 రిటైర్డ్ హర్ట్), అక్షర్ పటేల్ (35*), రింకు సింగ్ (16) కూడా రాణించారు. చివర్లో హార్దిక్ పాండ్య (10 బంతుల్లో 30 పరుగులు) సౌతాఫ్రికా బౌలర్లపై విరుచకపడ్డాడు. ఇక ప్రొటీస్ బౌలర్లలో యాన్సెన్, కార్బిన్ బాష్, నోకియా, మఫాకా తలో వికెట్ పడగొట్టారు. ఫిబ్రవరి 7 నుంచి టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. అదే రోజు యూఎస్‌ఏతో టీమిండియా తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
వరల్డ్ కప్-2026 ఫైనల్‌కి దూసుకెళ్లిన యువ భారత్
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ