Share News

డబ్ల్యూసీ 2026: సెమీ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..

ABN , Publish Date - Feb 04 , 2026 | 07:22 PM

భారత యువ హిట్టర్ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గానిస్థాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు దంచికొట్టాడు. కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు.

డబ్ల్యూసీ 2026: సెమీ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గానిస్థాన్‌పై ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు దంచికొట్టాడు. కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. క్రీజులో ఉన్నంత సేపు అఫ్గాన్ బౌలర్లను వైభవ్ భయపెట్టాడు. అతడిని ఔట్ చేయడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.


అండర్‌-19 ప్రపంచకప్‌(Under 19 World Cup 2026) సెమీ ఫైనల్-2లో భాగంగా ఇవాళ (బుధవారం) అఫ్గానిస్థాన్, భారత్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గాన్.. మొదట బ్యాటింగ్ చేసి.. 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో అఫ్గాన్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం యువ భారత్ బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో భారత్‌ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది.


అయితే, భారత ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్‌ సదాత్‌కు క్యాచ్‌ ఇచ్చి వైభవ్‌ సూర్యవంశీ పెవిలియన్‌ చేరాడు. కాగా ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(62) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. రెండో వికెట్ కు మాత్రే, అరోన్ 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో అరోన్ జార్జి(73*), విహాన్ మల్హోత్ర(7*) ఉన్నారు. భారత్ స్కోర్.. 31 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టాన్ని 240 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానం అభిషేక్ శర్మదే

భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - Feb 04 , 2026 | 08:00 PM