Share News

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన అమెరికా

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:05 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియా-యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన అమెరికా
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియా-యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది. గాయం కారణంగా హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే జట్టు నుంచి దూరమైన విషయం తెలిసిందే. వైరల్ ఫీవర్ కారణంగా స్టార్ పేసర్ బుమ్రా కూడా తుది జట్టులో లేడు. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కింది. అనుకున్నట్టుగానే సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.


భారత తుది జట్టు..

ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, శివం దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్


అమెరికా తుది జట్టు..

ఆండ్య్రూ గౌస్(వికెట్ కీపర్), సాయి తేజ, మోనంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే, హర్మీత్ సింగ్, మోసిన్,వాన్, అలీ ఖాన్, సౌరభ్


ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 07 , 2026 | 07:05 PM