Home » Cricket
గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు.
కోల్‌కతా పిచ్‌పై వస్తోన్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించాడు. విమర్శకులు భారత క్రికెట్ వైపు వేలెత్తి చూపించడం మానేయాలని మండిపడ్డాడు.
సౌతాఫ్రికా-టీమిండియా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు కొనసాగుతోంది. నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ సేన.. 260 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. టీమిండియా టార్గెట్ 549 పరుగులు.
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ సేన చెలరేగుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. టీమిండియాపై 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన చేస్తూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో సఫారీ సేన గెలిస్తే.. ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంటుంది.
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. మూడో రోజు 201 పరుగులకే ఆలౌటైన భారత్.. 314 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి సఫారీ బ్యాటర్లు 26/0 స్కోరు చేశారు.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 288 పరుగుల వెనుకంజలో ఉంది.
సొంతగడ్డపై టీమిండియా వరుస పరాభవాలు చవి చూస్తుంది. న్యూజిలాండ్‌తో క్లీన్ స్వీప్.. కోల్‌కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ రికార్డుల గురించి నెట్టింట చర్చ మొదలైంది.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్‌ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.