టీ20 ప్రపంచ కప్ 2026: సూర్య తుపాన్ ఇన్నింగ్స్.. అమెరికా టార్గెట్ 162
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:05 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ స్టేజిలో వాంఖడే వేదికగా టీమిండియా-యూఎస్ఏ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసింది. యూఎస్ఏ జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గ్రూప్ స్టేజిలో వాంఖడే వేదికగా టీమిండియా-యూఎస్ఏ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 161 పరుగుల చేసింది. యూఎస్ఏ జట్టుకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ వైపు పేకమేడల్లా బ్యాటర్లంతా కుప్పకూలిపోతున్నా.. కెప్టెన్ సూర్య ఒంటరిగా పోరాడాడు. కేవలం 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్సులు బాది విధ్వంసం సృష్టించాడు.
77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా 100 పరుగులైనా చేస్తుందా? అన్న సందేహాలు ఏర్పడ్డాయి. ఒకే ఓవర్‌లో తిలక్ వర్మ, శివం దూబె, ఇషాన్ కిషన్‌లను ఔట్ చేసి షాక్‌విక్.. టీమిండియాకు షాకిచ్చాడు. సూర్య నిలబడ్డాడు కాబట్టే ఈ మోస్తరు స్కోరు అయినా భారత్ సాధించిందనడంలో సందేహమే లేదు. బ్యాటర్లలో సూర్యకుమార్(84*) టాప్ స్కోరర్. ఇషాన్ కిషన్(20), తిలక్ వర్మ(25) పర్వాలేదనిపించారు. అభిషేక్ శర్మ(0), శివమ్ దూబె(0), రింకూ సింగ్(6), హార్దిక్ పాండ్య(5), అక్షర్ పటేల్(14), అర్ష్‌దీప్ సింగ్(4) వరుణ్ చక్రవర్తి(0) తీవ్రంగా విఫలమయ్యారు.
అమెరికా బౌలర్లలో వాన్ షాక్‌విక్ 4 వికెట్లు తీసి ఆశ్చర్యపర్చాడు. హర్మీత్ సింగ్ 2, అలీ ఖాన్, మొహ్సిన్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!