టీ20 వరల్డ్ కప్: షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు.. స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ విజయం
ABN , Publish Date - Feb 07 , 2026 | 07:28 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన స్కాట్లాండ్ ఆది నుంచి తడబడుతూ 147 పరుగులకే ఆలౌటైంది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన స్కాట్లాండ్ ఆది నుంచి తడబడుతూ 147 పరుగులకే ఆలౌటైంది. బెర్రింగ్‌టన్(42), బ్రూస్(35) పర్వాలేదనిపించారు. ఇతర బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు.
వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ అదరగొట్టాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 17వ ఓవర్లో స్కాట్లాండ్ బ్యాటర్లు క్రాస్, లీస్క్, డేవిడ్‌సన్‌లను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆరో బంతికి షరిఫ్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా 3 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కాగా హోల్డర్ 2, జోసెఫ్, మోటీ తలో వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!