Share News

టీ20 ప్రపంచ కప్ 2026: టీమిండియా శుభారంభం.. యూఎస్ఏపై ఘన విజయం

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:01 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2026: టీమిండియా శుభారంభం.. యూఎస్ఏపై ఘన విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా శుభారంభం చేసింది. యూఎస్ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదనకి దిగిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు కఠిన పరీక్షే ఎదురైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. సూర్య ఒంటరి పోరాటం చేయడం వల్లే టీమిండియాకు 161 పరుగుల మోస్తరు స్కోరు అయినా వచ్చింది.


ఓ వైపు వికెట్లు పడుతున్నా.. సూర్య(84*) మాత్రం చెలరేగి ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా 100 పరుగులైనా చేస్తుందా? అన్న సందేహాలు ఏర్పడ్డాయి. ఒకే ఓవర్‌లో తిలక్ వర్మ, శివం దూబె, ఇషాన్ కిషన్‌లను ఔట్ చేసిన షాక్‌విక్.. టీమిండియాకు షాకిచ్చాడు. బ్యాటర్లలో సూర్యకుమార్(84*) టాప్ స్కోరర్. ఇషాన్ కిషన్(20), తిలక్ వర్మ(25) పర్వాలేదనిపించారు. అభిషేక్ శర్మ(0), శివమ్ దూబె(0), రింకూ సింగ్(6), హార్దిక్ పాండ్య(5), అక్షర్ పటేల్(14), అర్ష్‌దీప్ సింగ్(4) వరుణ్ చక్రవర్తి(0) తీవ్రంగా విఫలమయ్యారు. అమెరికా బౌలర్లలో వాన్ షాక్‌విక్ 4 వికెట్లు తీసి ఆశ్చర్యపర్చాడు. హర్మీత్ సింగ్ 2, అలీ ఖాన్, మొహ్సిన్ తలొక వికెట్ పడగొట్టారు.


162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ బ్యాటర్లు ఆది నుంచే తడబడ్డారు. మిలింద్(34), సంజయ్(37), శుభం(37) పర్వాలేదనపించారు. ఆండ్రిస్(6), సాయి తేజ(2), మోనాంక్ పటేల్(0), హర్మీత్ సింగ్(0), మొహ్సిన్(8) విఫలమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్ 3, అక్షర్, అర్ష్‌దీప్ తలో రెండు, వరుణ్ ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 07 , 2026 | 11:04 PM