Share News

టీ20 ప్రపంచ కప్ 2026: అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్.. న్యూజిలాండ్ ఘన విజయం

ABN , Publish Date - Feb 08 , 2026 | 02:38 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్.. 17.5 ఓవర్లలోనే ఛేదించింది.

టీ20 ప్రపంచ కప్ 2026: అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్.. న్యూజిలాండ్ ఘన విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్(65) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్.. 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. గుల్బాదిన్ నైబ్(63) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుర్బాజ్(27), అటల్(29), రసూల్(20) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, రచిన్ రవీంద్ర, హెన్రీ, డఫీ తలొక వికెట్ పడగొట్టారు.


183 పరుగుల విజయ లక్ష్యతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. ఆదిలో కాస్త తడబడింది. అలెన్(1), రచిన్ రవీంద్ర(0) తీవ్రంగా నిరాశపర్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(42), టిమ్ సీఫర్ట్(65) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 46 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. మార్క్ చాప్‌మన్(28) పర్వాలేదనిపించాడు. మిచెల్(25), శాంట్నర్(17) నాటౌట్‌గా నిలిచి ఆటను ముగించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో ముజీబుర్ రెహమాన్ 2, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: అభిషేక్‌కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు

Updated Date - Feb 08 , 2026 | 02:38 PM