Home » Cricket
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత వారంలో టాప్ ప్లేస్‌కు వచ్చిన డారిల్ మిచెల్.. ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయాడు.
సౌతాఫ్రికాతో వైట్‌వాష్‌కు గురయ్యాక టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో మరింత కిందకి దిగజారింది. నాలుగో స్థానంలో ఉన్న భారత్.. ఈ ఓటమి తర్వాత ఐదో స్థానానికి పడిపోయింది. మన కంటే ముందు స్థానంలో పాకిస్తాన్ జట్టు కొనసాగుతోంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? అనే చర్చ మొదలైంది. నెలల వ్యవధిలోనే టీమిండియా సిరీస్‌లు ఓడిపోవడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాన కోచ్ గంభీర్ దీనికి కారణమనే చర్చ నడుస్తోంది.
గువాహటి టెస్టులో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆతిథ్య భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడాడు.
టీమిండియా సౌతాఫ్రికాపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్‌నకు గురైంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని వెల్లడించాడు. ఈ పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా? లేదా? బోర్డు డిసైడ్ చేస్తుందని తెలిపాడు.
గువాహటి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు ఓడటంతో సఫారీలపై భారత్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా టెస్ట్ తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ప్లీహానికి తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరమయ్యాడు. తాజాగా అయ్యర్ సాధన మొదలు పెట్టాడు.
భారత స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. మరోవైపు పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.
గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు.