• Home » Cricket

Cricket

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ప్లేయర్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీ చరణి కూడా భాగమైంది. ఇదే ఆమెకు తొలి ప్రపంచ కప్. అరంగేట్రంలోనే అద్భుతం చేసింది. 9 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టి టాప్ 5 బౌలర్లలో నిలిచింది.

Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!

Harmanpreet-Gavaskar: నాడు గావస్కర్.. నేడు హర్మన్!

టీమిండియా తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సౌతాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి కొట్టగా.. కెప్టెన్ హర్మన్ ఆ క్యాచ్‌ను చక్కగా ఒడిసిపట్టింది. బంతిని క్యాచ్ పట్టిన అనంతరం హర్మన్ ప్రీత్ దాన్ని జేబులో భద్రంగా దాచిపెట్టుకున్న తీరు క్రికెట్ అభిమానులకు భారత దిగ్గజం సునీల్ గావస్కర్‌ను గుర్తు చేసింది.

Harmanpreet Kaur: ఆ ఓటమి మాలో మార్పు తెచ్చింది: హర్మన్

Harmanpreet Kaur: ఆ ఓటమి మాలో మార్పు తెచ్చింది: హర్మన్

ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025.. భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీని ముద్దాడిన రోజు. ఒకానొక దశలో సెమీస్‌కు చేరుకోవడమే కష్టమనే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారిగా పుంజుకుని పోరాడి నిలిచి గెలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది.

BCCI Cash Reward: ఉమెన్ ఇన్ బ్లూకు డబ్బే.. డబ్బు.  రూ. 51 కోట్ల క్యాష్ ప్రైజ్, ఇంకా ఎన్నో..

BCCI Cash Reward: ఉమెన్ ఇన్ బ్లూకు డబ్బే.. డబ్బు. రూ. 51 కోట్ల క్యాష్ ప్రైజ్, ఇంకా ఎన్నో..

మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రికెటర్లకు BCCI భారీ నజరానా ప్రకటించింది. అటు, ఐసీసీ కూడా గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్లు చేసింది. ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు..

India vs South Africa: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. బాల్ టు బాల్ అప్డేట్..

India vs South Africa: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. బాల్ టు బాల్ అప్డేట్..

ఇండియా, సౌతాఫ్రికా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025 క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా మెుదలైంది. ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో మట్టి కరిపించిన ఇండియా జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు వరల్డ్ కప్పును సొంతం చేసుకోలేదు. తాజా మ్యాచ్ తో వరల్డ్ కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అనే అని ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి..

Women's WC 2025:  టాస్ గెలిచిన సౌతాఫ్రికా..

Women's WC 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా..

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర అడ్డంకులు కలిగిస్తున్నాడు. రెండు గంటలు ఆలస్యంగా టాస్ వేశారు. దీంట్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

Irfan Pathan-Sanju Samson: సపోర్ట్ ఎప్పుడూ ఉండదు: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan-Sanju Samson: సపోర్ట్ ఎప్పుడూ ఉండదు: ఇర్ఫాన్ పఠాన్

ఆసీస్‌-టీమిండియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా మూడో టీ20 కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తాజాగా అతడి భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Women’s WC 2025: అలముకున్న ‘వాన’ భయం..

Women’s WC 2025: అలముకున్న ‘వాన’ భయం..

మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌పై ఉత్కంఠతో పాటు వర్షం భయం కూడా అలముకుంది. నవీ ముంబైలోని మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిన్నపాటి వర్షం మొదలైంది. దీంతో పిచ్‌పై మళ్లీ కవర్లు కప్పుతున్నారు. దీంతో మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది.

BCCI: కప్ గెలిస్తే.. టీమిండియాకు బీసీసీఐ భారీ ఆఫర్

BCCI: కప్ గెలిస్తే.. టీమిండియాకు బీసీసీఐ భారీ ఆఫర్

టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే బీసీసీఐ వారికి భారీ బొనాంజా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారత పురుషుల జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ.125కోట్ల ప్రైజ్ మనీ అందించింది. ఒకవేళ హర్మన్ సేన విశ్వవిజేతగా నిలుస్తే అంతే మొత్తంలో నజరానా ప్రకటించాలని బోర్డు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

IND w vs SA w: ఫైనల్ ఫైర్.. కప్‌ను తొలిసారి ముద్దాడుతామా?

IND w vs SA w: ఫైనల్ ఫైర్.. కప్‌ను తొలిసారి ముద్దాడుతామా?

మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా నవంబర్ 2న సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌లో ఆసీస్‌పై చూపించిన దూకుడు పునరావృతమైతే భారత్ తొలిసారి ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది. లారా వాల్వార్ట్, కాప్ వంటి సఫారీ స్టార్‌లను నిలువరించడమే కీలకం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి