Home » Cricket
హాంకాంగ్ సూపర్ సిక్సెస్ 2025లో భాగంగా ఇవాళ(నవంబర్ 7) ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సంచలన విజయం నమోదు చేసింది.
డబ్ల్యూపీఎల్ మెగా వేలానికి ముందు యూపీ వారియర్స్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను విడుదల చేయడం చర్చనీయాంశమైంది. కొత్తగా జట్టును నిర్మించేందుకు పర్సులో ఎక్కువ మొత్తం ఉంచుకోవాలనేదే తమ నిర్ణయానికి కారణమని హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపారు.
ఆన్‌లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని బుధవారం అరెస్టు చేశారు కడప జిల్లా పోలీసులు.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో టీమిండియాకు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. నవంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 12 జట్లు పోటీపడనున్నాయి. ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీకి డీకే సారథ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ కారణంగానే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టామని, అతడు ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపాడు.
ప్రపంచ కప్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చింది. ‘కలలు కనడం ఆపొద్దు, కష్టపడితే అవి నిజమవుతాయి’ అని సూచించింది.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మోకాలి గాయం కారణంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. సిడ్నీ థండర్ జట్టులో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. ఆ అవకాశం వాయిదా పడింది.
2003 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌కు రూ.వెయ్యి మాత్రమే ఇచ్చారని మిథాలీ రాజ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మహిళా క్రికెట్‌కు స్పాన్సర్లు, సౌకర్యాలు కూడా లేవని చెప్పారు.
ప్రపంచ కప్ గెలిచిన వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేరుగా వెళ్లి తన తండ్రిని హత్తుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ తన కుమార్తెను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.