Home » Cricket
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రిషభ్ పంత్ మరోసారి గాయపడ్డాడు. భారత్–సఫారీ ఏ మ్యాచ్‌లో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. పంత్ త్వరగా కోలుకుని ఫీట్‌గా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో అగ్రెషన్‌తో ఉండే కోహ్లీ.. తండ్రి అయ్యాక నెమ్మదస్తుడు అయ్యాడని తెలిపాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీస్తే టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో ఈ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహిళల క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే ప్రపంచ కప్ 2029లో జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పది పెంచాలని నిర్ణయించింది.
హాంకాంగ్ ఇంటర్నేషన్ సిక్సెస్‌లో టీమిండియాకు షాక్ తగిలింది. పూల్-సిలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్.. నిర్ణీత ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. ఆరు వికెట్లు కోల్పోయి 79 పరుగులకే పరిమితమైంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 లీగ్ స్టేజ్‌లో టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ అద్భుతంగా రాణించింది. గాయం కారణంగా ప్రపంచకప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు దూరమైంది. అయితే తన స్థానంలో అనూహ్యంగా షెఫాలి వర్మ ఆడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందే షెఫాలీ ఏదో మ్యాజిక్ చేయబోతుందని ప్రతీకాకు అనిపించిందట!
ఐపీఎల్-2026లో క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా?, లేదా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రతి సీజన్‌కు ముందు ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు పరిపాటిగా మారాయి. అయితే..
మహ్మద్ షమీ చెల్లిస్తున్న నెలకు రూ.4 లక్షల భరణం తమ అవసరాలకు సరిపోవడం లేదంటూ హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై సుప్రీం షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అర్జున రణతుంగ.. శ్రీలంకకు 1996 వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్. ప్రస్తుతం ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన రణతుంగ ఇప్పుడు బాగా సన్నబడ్డారని అభిమానులు షాక్ అవుతున్నారు.
హాంకాంగ్ సూపర్ సిక్సెస్ 2025లో భాగంగా ఇవాళ(నవంబర్ 7) ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సంచలన విజయం నమోదు చేసింది.