Home » Cricket
భారత క్రికెట్ దిగ్గజం ధోనీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా తన అభిమాని బైక్‌తో పాటు అతడి చేతిపై ఆటోగ్రాఫ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు. అన్నిసార్లు దూకుడుగా ఆడటం పనికి రాదని స్పష్టం చేశాడు. ఆ దూకుడుతనం ప్రత్యర్థి బౌలర్లకు అనుకూలంగా మారుతుందని తెలిపాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవిష్యత్తులో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపడతారనే నమ్మకం ఉందని తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
సౌతాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ధ్రువ్ జురెల్‌ను తీసుకోనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో మిచెల్ స్టార్క్, ఫాప్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ముఖేశ్ కుమార్, నటరాజన్ ఉన్నట్లు సమాచారం.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మళ్లీ వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్, పాకిస్తాన్‌పై అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డును సమం చేశాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఇవాళ గబ్బాలో ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. దీంట్లోనూ అదరగొట్టి సిరీస్ పట్టేయాలని సూర్య సేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. మిగతా మూడులో టీమిండియా రెండు గెలిచిన సంగతి తెలిసిందే.
వర్షం కారణంగా ఐదో టీ20 రద్దు కావడంతో టీమిండియా 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభం ఇచ్చారు. గత 17 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ను కోల్పోని రికార్డును భారత్ కొనసాగించింది.
గబ్బా స్టేడియంలో వర్షం మొదలైంది. దీంతో ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రేక్షకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.