Home » Cricket
స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారని కేఎల్ వెల్లడించాడు. సరైన ప్రదర్శన చేయకపోతే యజమానులు బోలెడు ప్రశ్నలు వేస్తారని తెలిపాడు.
సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ ఓడిపోవడంపై మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టెస్టు క్రికెట్‌ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్వదేశంలోనే ఛేదించలేకపోవడం ఏంటని ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను హెడ్ కోచ్‌గా నియమిస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ వైదొలగడంతో.. సంగక్కర ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం గంగూలీ.. హెడ్ కోచ్ గంభీర్‌కు ఓ కీలక సూచన చేశాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై భారత మాజీ బ్యాటర్ పుజారా స్పందించాడు. స్వదేశంలో టీమిండియా ఓడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించాడు.
ఏసీసీ టోర్నీలో ఇండియా-ఏ జట్టుపై పాకిస్తాన్-ఏ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ దగ్గర క్యాచ్ పట్టినా అంపైర్ నాటౌట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అతడి తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియా ఓడిందని నెటిజన్లు ఫైరవుతున్నారు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సౌతాఫ్రికాతో టెస్ట్‌లో గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి.. ఆసుపత్రిలో చేరాడు. తాజాగా గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
సాతాఫ్రికా కెప్టెన్ బావుమాను బుమ్రా మరుగుజ్జు అంటూ సంబోధించిన విషయం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ముగిసిన తర్వాత బావుమాకు బుమ్రా సారీ చెప్పాడు.