హైదరాబాద్ మ్యాచ్ డ్రా
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:26 AM
నాకౌట్ రేస్ నుంచి ఈపాటికే అవుటైన హైదరాబాద్ జట్టు గ్రూప్-డిలో భాగంగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అమన్‌దీ్‌ప ఖరే (176 నాటౌట్) అజేయ శతకంతో...
రంజీ క్వార్టర్స్ షెడ్యూల్
(ఈ నెల 6 నుంచి )
జార్ఖండ్ X ఉత్తరాఖండ్
మధ్యప్రదేశ్ X జమ్మూ కశ్మీర్
బెంగాల్ X ఆంధ్ర
ముంబై X కర్ణాటక
హైదరాబాద్: నాకౌట్ రేస్ నుంచి ఈపాటికే అవుటైన హైదరాబాద్ జట్టు గ్రూప్-డిలో భాగంగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. అమన్‌దీ్‌ప ఖరే (176 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో ఛత్తీ్‌సగఢ్ డ్రాతో గట్టెక్కింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా హైదరాబాద్‌కు 3 పాయింట్లు లభించాయి. ఆటకు నాలుగో, ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఛత్తీ్‌సగఢ్ 8 వికెట్లకు 411 పరుగులు చేసింది. ఆదివారం ఆట ఆఖరుకు అమన్‌దీ్‌ప, దేవ్ ఆదిత్య (79) క్రీజులో ఉన్నారు. తనయ్ త్యాగరాజన్, అంకిత్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో ఛత్తీ్‌సగఢ్ 283 పరుగులకు ఆలౌట్ కాగా.. హైదరాబాద్ 631 రన్స్ స్కోరు చేసింది. ఇక, నాగాలాండ్‌తో డ్రా చేసుకొన్న ఆంధ్ర క్వార్టర్స్‌కు చేరుకొంది.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ