Home » Cricket news
టీమిండియా వెటరన్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్కే పాయింట్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
దేశవాళీ రంజీ ట్రోఫీ 2025లో టీమిండియా హిట్టింగ్ సెన్సేషన్ రింకూ సింగ్ చెలరేగుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనదైన బ్యాటింగ్‌తో సెంచరీల మోత మోగిస్తున్నాడు.
చనిపోవాలని ఉందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ల యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఒంటరితనం భరించలేకపోతున్నానని ఆయన వాపోయారు.
తన కొడుకు బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. రోహిత్ కొడుకు అహాన్ శర్మ మొదటి పుట్టిన రోజు అట్టహాసంగా జరిగింది. నవంబర్ 15, 2024న జన్మించిన అహాన్ మొదటి బర్త్‌డేను రోహిత్ కుటుంబం ఘనంగా సెలబ్రేట్ చేసింది.
కోల్‌కతా టెస్టులో పరుగులు చేయడానికి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన.. ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఈరోజు(నవంబర్ 15) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అతడు 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియం వేదికగా వన్డేల్లో తన 50వ సెంచరీ నమోదు చేశాడు. అతడు ఈ ఘనతను వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సాధించాడు.
యంగ్ ప్లేయర్ సూర్యవంశీ వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్-ఎ ఏకంగా 148 పరుగుల తేడాతో గెలిచి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. 297 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఐపీఎల్ వేలం నేపథ్యంలో ప్లేయర్‌ల ట్రేడ్స్‌కు సంబంధించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా షమీని ఎల్‌ఎస్‌జీకి ఇచ్చేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైందన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ గుడ్ న్యూస్ వచ్చింది. గాయం కారణంతో విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌కు చాలా ముందుగానే తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాజ్ కోట్ వేదికగా సౌతాఫ్రికా- ఏ జట్టుతో జరిగిన అనధికారిక వన్డేలో భారత్- ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.