Share News

అదరగొట్టిన అరుంధతి, శ్రీచరణి

ABN , Publish Date - Feb 16 , 2026 | 05:02 AM

భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల...

అదరగొట్టిన  అరుంధతి, శ్రీచరణి

భారత మహిళల బోణీ జూ ఆసీ్‌సతో తొలి టీ20

సిడ్నీ: భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఆరంభించింది. ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన 21 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు టీ20ల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యం సాధించింది. తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి నాలుగు, శ్రీచరణి రెండు వికెట్లతో కట్టడి చేయగా.. ఆసీస్‌ 18 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. వేర్‌హమ్‌ (30), లిచ్‌ఫీల్డ్‌ (26), ఎలిస్‌ (20) మోస్తరుగా ఆడారు. రేణుకా సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత ఛేదనలో భారత్‌ 5.1 ఓవర్లలో 50/1 స్కోరు దగ్గర భారీ వర్షం కురిసింది. మ్యాచ్‌ రద్దు అయినప్పటికీ డ/లూ పద్దతిన అదనంగా 21 రన్స్‌ చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. షఫాలీ (21), మంధాన (16 నాటౌట్‌) రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అరుంధతి నిలిచింది.

సంక్షిప్త స్కోర్లు: ఆస్ర్టేలియా: 18 ఓవర్లలో 133 ఆలౌట్‌ (వేర్‌హమ్‌ 30, లిచ్‌ఫీల్డ్‌ 26; అరుంధతి 4/22, శ్రీచరణి 2/14, రేణుకా 2/14); భారత్‌: 5.1 ఓవర్లలో 50/1 (షఫాలీ 21, మంధాన 16 నాటౌట్‌; మోలినెక్స్‌ 1/13).

Updated Date - Feb 16 , 2026 | 05:29 AM