Share News

పడిక్కళ్‌ ‘డబుల్‌’

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:53 AM

కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (232) ద్విశతకంతో, రవిచంద్రన్‌ స్మరణ్‌ (121 బ్యాటింగ్‌) సెంచరీతో కదం తొక్కడంతో ఉత్తరాఖండ్‌తో రంజీట్రోఫీ సెమీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో...

పడిక్కళ్‌ ‘డబుల్‌’

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ 689/6

ఉత్తరాఖండ్‌తో రంజీ సెమీస్‌

లఖ్‌నవూ: కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (232) ద్విశతకంతో, రవిచంద్రన్‌ స్మరణ్‌ (121 బ్యాటింగ్‌) సెంచరీతో కదం తొక్కడంతో ఉత్తరాఖండ్‌తో రంజీట్రోఫీ సెమీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్‌ 355/2 స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన కర్ణాటక.. పడిక్కళ్‌, స్మరణ్‌ విజృంభణతో రెండో రోజు ఆఖరికి 689/6 స్కోరు సాధించింది. ఇక..పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలో జరుగుతున్న మరో సెమీఫైనల్లో రెండో రోజు ఆట చివరికి జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 198/5 స్కోరు చేసింది. అంతకుముందు 249/5 స్కోరుతో మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బెంగాల్‌ 328 పరుగులకు ఆలౌటైంది.

ఇవి కూడా చదవండి:

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Updated Date - Feb 17 , 2026 | 04:53 AM