రాహుల్, పడిక్కళ్ సెంచరీలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:53 AM
ఉత్తరాఖండ్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), దేవ్‌దత్ పడిక్కళ్ (148 నాటౌట్)...
కర్ణాటక 355/2 జూ ఉత్తరాఖండ్‌తో రంజీ సెమీస్
లఖ్‌నవూ: ఉత్తరాఖండ్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), దేవ్‌దత్ పడిక్కళ్ (148 నాటౌట్) శతకాలతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 355 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (18) ఆదిలోనే వెనుదిరిగినా.. రాహుల్, దేవ్‌దత్ స్కోరుబోర్డును నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 278 పరుగులు జోడించారు. తొలిరోజు ఆట ముగిసేసరికి పడిక్కళ్‌కు తోడుగా కరుణ్ నాయర్ (37 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
ఘరామి అజేయ శతకం: బెంగాల్ 249/5
పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి వేదికగా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో బెంగాల్ ఆటగాడు సుదీ్‌పకుమార్ ఘరామి (136 నాటౌట్) అజేయ శతకంతో విజృంభించాడు. దీంతో ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (49), షాబాజ్ అహ్మద్ (42) రాణించారు. జమ్ము బౌలర్లలో సునీల్ కుమార్, ఆకిబ్ నబి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..