పోటెత్తిన అభిమానం
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:38 AM
టోర్నమెంట్ ఏదైనా సరే.. భారత్, పాకిస్థాన్ పోరుకు ఉండే క్రేజే వేరు. అందులోనూ విశ్వక్‌పలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే.. క్రికెట్ ఫీవర్ మరింత హీటెక్కెడం ఖాయం. ఇప్పుడు టీ20 ప్రపంచక్‌పలోనూ...
కొలంబో: టోర్నమెంట్ ఏదైనా సరే.. భారత్, పాకిస్థాన్ పోరుకు ఉండే క్రేజే వేరు. అందులోనూ విశ్వక్‌పలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే.. క్రికెట్ ఫీవర్ మరింత హీటెక్కెడం ఖాయం. ఇప్పుడు టీ20 ప్రపంచక్‌పలోనూ అదే జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో దాయాది జట్ల పోరును కనులారా వీక్షించేందుకు అభిమానులు ప్రేమాదాస స్టేడియానికి పోటెత్తారు. స్థానికంగా ఉండే ప్రేక్షకులే గాకుండా.. ఇరు దేశాల నుంచి అనేకమంది శ్రీలంక రాజధాని కొలంబోకు తరలివచ్చారు. భారత్ నుంచి 18వేలకు పైగా మద్దతుదారులు, పాక్ తరఫున 12వేలకు పైగా అభిమానులు హాజరై తమ జట్లను ఉత్సాహపరిచారు. మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు మొదలైనా, స్టేడియం గేట్లు మధ్యాహ్నం మూడు గంటలకే తెరవడంతో ముందే స్టేడియం నిండిపోయింది. బాయ్‌కాట్ వార్తల నేపథ్యంలో తొలుత ఇండో-పాక్ మ్యాచ్ జరగడంపై సందేహం నెలకొన్నా, ఆ తర్వాత పాక్ తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో విమాన టిక్కెట్లకు రెక్కలొచ్చాయి. కొలంబోలో బుకింగ్స్ కూడా ముందుగానే జరిగిపోయాయి. ఒకరకంగా ఈ మ్యాచ్‌తో శ్రీలంక పర్యాటక శాఖకు భారీగా ఆదాయం చేకూరింది.
2వేల మంది పోలీసులతో భద్రత..: ఇండో-పాక్ పోరు కావడంతో ఈ మ్యాచ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్‌గా 2వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించారు. 600 మంది పారా మిలటరీ దళాలను బరిలోకి దించారు.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..