Share News

అమెరికా.. గెలిచి నిలిచింది!

ABN , Publish Date - Feb 16 , 2026 | 05:36 AM

సూపర్‌-8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్‌ కృష్ణమూర్తి (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్‌), కెప్టెన్‌ మోనంక్‌ పటేల్‌...

అమెరికా.. గెలిచి నిలిచింది!

  • 31 రన్స్‌తో నమీబియా ఓటమి

  • సంజయ్‌, మోనంక్‌ హాఫ్‌ సెంచరీలు

చెన్నై: సూపర్‌-8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో అమెరికా దుమ్ము రేపింది. సంజయ్‌ కృష్ణమూర్తి (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్‌), కెప్టెన్‌ మోనంక్‌ పటేల్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్‌ సెంచరీలతో రెచ్చిపోయిన వేళ 31 పరుగులతో నమీబియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత అమెరికా 20 ఓవర్లలో 199/4 స్కోరు చేసింది. పొట్టి క్రికెట్‌లో ఆ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ క్రమంలో గత టీ20 ప్రపంచ కప్‌లో కెనడాపై చేసిన 197/3 రన్స్‌ స్కోరును అమెరికా అధిగమించింది. చివర్లో మిలింద్‌ కుమార్‌ (28) మెరుపులు మెరిపించాడు. మైబర్గ్‌, ఎరాస్మస్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 168/6 స్కోరుకే పరిమితమై ఓడింది. స్టీన్‌కాం్‌ప (58), స్మిట్‌ (31) రాణించారు. ఈటన్‌ (28) పర్లేదనిపించాడు. షాక్విక్‌ రెండు వికెట్లు సాధించాడు. సంజయ్‌ కృష్ణమూర్తి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు:

అమెరికా: 20 ఓవర్లలో 199/4 (సంజయ్‌ కృష్ణమూర్తి 68 నాటౌట్‌, మోనంక్‌ పటేల్‌ 52, మిలింద్‌ కుమార్‌ 28, జహంగీర్‌ 22, మైబర్గ్‌ 2/22, గెరార్డ్‌ ఎరాస్మస్‌ 2/27);

నమీబియా: 20 ఓవర్లలో 168/6 (స్టీన్‌కాం్‌ప 58, స్మిట్‌ 31, ఈటన్‌ 28, షాల్విక్‌ 2/30).

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్.. పాకిస్థాన్ టార్గెట్ ఎంతంటే..

Updated Date - Feb 16 , 2026 | 05:36 AM