సూపర్-8కు విండీస్
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:29 AM
రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తోంది. గ్రూప్-సిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ను 9 వికెట్లతో చిత్తుచేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు...
9 వికెట్లతో గెలుపు
నేపాల్ అవుట్
ముంబై: రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తోంది. గ్రూప్-సిలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ను 9 వికెట్లతో చిత్తుచేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకున్న కరీబియన్ జట్టు అందరికంటే ముందుగా టోర్నీలో సూపర్-8 బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు వరుసగా మూడో పరాజయంతో నేపాల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్.. జేసన్ హోల్డర్ (4-0-27-4) దెబ్బకు 20 ఓవర్లలో 133/8 స్కోరుకే పరిమితమైంది. మాథ్యూ ఫోర్డె (4-1-10-1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీపేంద్రసింగ్ ఐరీ (58) అర్ధ సెంచరీతో రాణించాడు. సోంపాల్ కామి (26 నాటౌట్) ఫర్వాలేదనిపించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఛేదనలో కెప్టెన్ షాయ్ హోప్ (44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 నాటౌట్) సత్తా చాటడంతో విండీస్ 15.2 ఓవర్లలోనే 134/1 స్కోరు చేసి గెలిచింది. హోప్‌కు హెట్‌మయెర్ (46 నాటౌట్), బ్రాండన్ కింగ్ (22) సహకరించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హోల్డర్ నిలిచాడు.
సంక్షిప్త స్కోర్లు:
నేపాల్: 20 ఓవర్లలో 133/8 (దీపేంద్రసింగ్ 58, సోంపాల్ 26 నాటౌట్; హోల్డర్ 4/27, మాథ్యూ 1/10, చేజ్ 1/10);
వెస్టిండీస్: 15.2 ఓవర్లలో 134/1 (హోప్ 61 నాటౌట్, హెట్‌మయెర్ 46 నాటౌట్, బ్రాండన్ 22; నందన్ యాదవ్ 1/24).
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..