Share News

మనమ్మాయిలు పాక్‌ను పడగొట్టారు

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:59 AM

టీ20 ప్రపంచక్‌పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్‌ అమ్మాయిలు కూడా పాక్‌ పని పట్టారు. మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌...

మనమ్మాయిలు పాక్‌ను పడగొట్టారు

స్పిన్నర్ల విజృంభణ

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌

బ్యాంకాక్‌: టీ20 ప్రపంచక్‌పలో ఆదివారం భారత పురుషుల జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే... ఇదేరోజు భారత జూనియర్‌ అమ్మాయిలు కూడా పాక్‌ పని పట్టారు. మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌-ఎ పోరులో భారత-ఎ జట్టు 8 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. జట్టు కెప్టెన్‌, స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (2/11)కు తోడు సైమా ఠాకూర్‌ (2/14), ప్రేమా రావత్‌ (2/16) బౌలింగ్‌లో విజృంభించడతో.. పాక్‌ 18.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. షవాల్‌ జుల్ఫికర్‌ (23) టాప్‌స్కోరర్‌. స్వల్ప ఛేదనలో దినేశ్‌ వ్రింద (55) అజేయ అర్ధ సెంచరీతో భారత్‌ 10.1 ఓవర్లలోనే 97/2 స్కోరు చేసి అలవోకగా గెలిచింది. అనుష్క శర్మ (24) రాణించింది. ఈ టోర్నీలో భారత-ఎ జట్టుకిదే తొలి గెలుపు. అంతకుముందు శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో భారత్‌ ఓటమిపాలైంది.

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 04:59 AM