Home » Cricket news
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అద్భుతమైన పోరాటం చేసి 332 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ నాలుగు, హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు.
రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఓటమి వైపు పయనిస్తోంది. 350 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది.
రాంచి వేదికగా ఇవాళ(ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో (WBBL) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంపైర్లు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి కారణమైంది. సిడ్నీ జట్టు గెలుపుకు 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు అవసరం. ఇలాంటి సమయంలో ఫీల్డ్ అంపైర్లు ఎలోయిస్ షెరిడాన్, స్టీఫెన్ డయోనిసియస్ వర్షం వల్ల ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ముంబై ఓపెనర్ ఆయుశ్ మాత్రే సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ రికార్డ్ బద్దలైంది. ఇదే సమయంలో విదర్భపై ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం హర్యానా, పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో హర్యానా గెలిచింది. సూపర్ ఓవర్లో పంజాబ్ పై హర్యానా విజయం సాధించింది.
భారత్‌కు చెందిన అంధ మహిళల క్రికెట్ జట్టు టీ-20 ప్రపంచకప్ గెలిచింది. నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
క్రికెట్ అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చింది. పురుషుల అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్ భారత్.. యూఎస్ఏతో తలపడనుంది.
సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 73 పరుగుల తేడాతో భారత ఏ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాపార్డ్ ఘోరంగా విఫలమైంది.